Site icon Prime9

Eggs : కోడి గుడ్లను కడుగుతున్నారా ? ఐతే ఈ కంటెంట్ పూర్తిగా చదవండి !

Eggs : సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి న్యూట్రీషియన్స్ రిచ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం.మనలో చాలా మంది శరీరంలో ప్రోటీన్ లోపాన్ని సరి చేసుకోవడానికి పాలు, పెరుగు మరియు జున్ను వంటి పాల పదార్ధాలను తీసుకుంటారు.ఇంకోవైపు పాల ఉత్పత్తుల తర్వాత గుడ్లను ఎక్కువుగా తీసుకుంటారు.గుడ్డులో ప్రొటీన్లు ఉండటమే కాకుండా అనేక విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఎక్కువుగా ఉంటాయి.ఐతే గుడ్లు కడిగిన తర్వాత గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదా? కదా ? అని అనే విషయం చాలామందికి తెలియదు.

మనం మార్కెట్ నుండి కొన్న వస్తువులను కడిగిన తర్వాతే తినడానికి ఇష్టపడతాము.ఇది మంచి అలవాటు ఐతే గుడ్లు బ్యాక్టీరియా లేకుండా ఉండటానికి ఈ అలవాటు కూడా కారణం కావచ్చు.గుడ్లు కడగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి.కడిగిన గుడ్లు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటే త్వరగా చేడిపోతాయి.అందుకే గుడ్లు కడిగిన తర్వాత ఎక్కువ సేపు పాడవకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్లో నిల్వ చేయాలి.గుడ్ల పైన క్యూటికల్స్ మరియు బ్లూమ్ అని ఉంటుంది.ఇది గుడ్డును బ్యాక్టీరియా మరియు గాలి నుండి సురక్షితంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.ఐతే గుడ్లు కడగడం వల్ల వాటి రక్షణ పూత పూర్తిగా తొలగిపోతుంది.దాని వల్ల గుడ్లు త్వరగా పాడవుతాయి.

Exit mobile version
Skip to toolbar