Site icon Prime9

Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

corona XXB variant in Maharashtra

corona XXB variant in Maharashtra

Corona Updates: కరోనా వల్ల మనమందరం గడిచిన 3 ఏళ్ళు ఇళ్ళకే పరిమితం అవ్వాలిసి వచ్చింది. ఇది కంటికి కనపడదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్లాది మంది ఈ కరోనా బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడినట్లు మన అందరికీ తెలిసిన విషయమే.కరోనా బారిన పడినప్పుడు చాలా మంది రుచి,వాసనను గ్రహించ లేరు. ఒక్క మాట చెప్పాలంటే ఈ వైరస్ బారినపడినవారు తిన్న తర్వాత దాని రుచి ఎలా ఉందో వాళ్ళకి తెలియదు అలాగే ఎంత ఘాటు వాసన చూసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మన ఆరోగ్యం మీద మనమే దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుందాం. ఇప్పటి వరకు ఈ లక్షణాలను దాదాపు 50శాతం కరోనా కేసులలో గుర్తించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14,320 మందికి కరోనా టెస్టులు పరీక్షలు నిర్వహించగా వారిలో 192 మంది వైరస్‌ బారినపడినటట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.34 లక్షల మందికి చేరింది.ఒక్కరోజులో కరోనా నుంచి 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.28 లక్షల మందికి చేరింది. ప్రస్తుతం 1,924 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

తాజాగా కరోనా వచ్చిన వారి మీద కొన్ని పరిశోధనలు చేసి కొన్ని విషయాలను వెల్లడించారు. కరోనా బారిన పడిన వారికి 5శాతం మందికి రుచి,వాసన 27 నెలలు వరకు వాళ్ళకి తిరిగి రాదని పరిశోదనలో వెల్లడించారు . ఐతే ,కొంత మందికి ఈ సమస్య కేవలం కొన్ని నెలల్లో నయం అవుతుందని వెల్లడించారు . కరోనా కారణంగా కొన్ని లక్షలాది మంది జనాలు ఈ సమస్యలతో బాధ పడుతున్నారని పరిశోధనలో పరిశోధకులు వెల్లడించారు.

Exit mobile version