Site icon Prime9

Vijay Devarakonda : మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 100 కుటుంబాల లిస్ట్ రిలీజ్

young hero vijay devarakonda announce 100 families list

young hero vijay devarakonda announce 100 families list

Vijay Devarakonda : “పెళ్లి చూపులు” చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “ఖుషీ”.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నేటి తరానికి తగ్గట్టు లవ్, మ్యారేజ్, జాతకాలు, కులాలు అన్నీ కలిసి వచ్చేలా ప్రేమ కథను రూపొందించి ప్రేక్షకులను అలరించగలిగారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ తరుణం లోనే మూవీ టీం వైజాగ్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.

 

 

అయితే తాజాగా విజయ్ తాజాగా ఆ లక్ష రూపాయలు గెలుచుకున్న లక్కీ ఫ్యాన్స్ లిస్ట్ విడుదల చేశారు. ఏ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఆ లిస్ట్ ని పోస్ట్ చేశారు. గతంలో కూడా విజయ్ దేవరకొండ ఓ వంద మంది అభిమానులను సొంత ఖర్చులతో నార్త్ ఇండియా టూర్ కి పంపాడు. కోవిడ్ సమయంలో కూడా విజయ్ ఒక టీమ్ ని ఏర్పాటు చేసి పేదలకు కిరాణా, కూరగాయలు వంటి నిత్యావసరాలు అందించారు.

Exit mobile version