Vijayashanti: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్‌

  • Written By:
  • Updated On - December 26, 2024 / 09:22 AM IST

Vijayashanti React on Tollywood Meeting With CM: సంధ్య థియేటర్‌ ఘటన అనంతరం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిణామల నేపథ్యంలో ఇవాళ సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు స్వయంగా వెల్లడించారు. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు గురువారం సీఎంతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత, నటి విజయశాంతి ఎక్స్‌ వేదికగా స్పందించారు.

ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. “తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రలను గురువారం సినీ ప్రముఖులు కలువనున్నారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చ జరగాలి. అలాగే ఈ సమావేశంలో టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా తెలంగాణ సినిమా, సంస్కృతి, ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగ, నివాస భద్రతలు, జీవన ఆధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కేటాయింపు, పరిరక్షణ అన్నింటిపై కూడా సమగ్రంగా చర్చించాలి. దీనిపై ప్రకటన కూడా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుననా. సర్వత్రా ఈ చర్చల నేపథ్యంలో సీఎం @revanth_anumula గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటుందని విశ్వసిద్దాం” అంటూ విజయశాంతి రాసుకొచ్చారు.