Varun – Lavanya Reception : వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా, అల్లు ఫ్యామిలీలు ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగా అభిమానులు వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.
ఇక నిన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వారి రెండు ఫ్యామిలీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, పలువురు మెగా అభిమాన సంఘాల నాయకులు హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రస్తుతం వరుణ్ – లావణ్య వెడ్డింగ్ రెసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.