Site icon Prime9

Varasudu Movie: మంచి ఊపు తెప్పిస్తున్న “రంజితమే” తెలుగు పాట

varasudu-movie- ranjithame telugu song-released

varasudu-movie- ranjithame telugu song-released

Varasudu Movie: దళపతి విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా అలరించనుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ నుంచి ‘రంజితమే’ సాంగును రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘బొండుమల్లె చెండూ తెచ్చా.. భోగాపురం సెంటూ తెచ్చా, కళ్లకేమో కాటుక తెచ్చా.. వడ్డాణం నీ నడుముకిచ్ఛా’ అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ అందించిన సంగీతానికి ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి-మనసి కలిసి ఈ సాంగ్ ఆలపించారు. కాగా తమిళ వర్షన్ వచ్చిన ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. మంచి మాస్ బీట్ తో వచ్చిన ఈ పాటను ప్రేక్షకులు అదేరీతిలో ఆదరించారు.

జానీ మాస్టారు కొరియోగ్రఫీతో జోరుగా.. హుషారుగా సాగే ఈ పాటలో, విజయ్ డాన్స్ ఆకట్టుకుంటుంది. మరోసారి ఆయన తన ఎనర్జీ లెవెల్స్ చూపించిన పాట ఇది.
గ్రాఫిక్స్ లోనే అయినప్పటికీ, కలర్ ఫుల్ ఫ్లవర్స్ నేపథ్యంలో కలర్ ఫుల్ గా ఈ పాటను ఆవిష్కరించారు. తమిళ మాస్ ఆడియన్స్ టేస్టుకు దగ్గరగానే ఈ పాటను ట్యూన్ చేశారనిపిస్తుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి: మహేశ్ సినిమాలో రష్మిక ఐటెం సాంగ్

Exit mobile version