Upcoming Releases : ఈ వేసవిలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్నసినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
అహింస..
ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు, డి.సురేష్‌బాబు తనయుడు, యంగ్ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ రానుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూర్చారు.
నేను స్టూడెంట్ సార్..
‘ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు “బెల్లంకొండ గణేష్” నటించిన రెండో మూవీ స్టూడెంట్ సార్!’. మొదటి మూవీ స్వాతిముత్యం తోనే మెప్పించిన ఈ హీరో.. ఈ చిత్రంతో మరో హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించగా.. సతీష్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. అవంతిక హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 2న థియేటర్లలోకి రానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.
పరేషాన్..
రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో తిరువీర్, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలుగా చేస్తున్నారు. పక్కా తెలంగాణ మూవీగా వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని మూవీ యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జూన్ 2న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
ఐక్యూ..
సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ జీఎల్‌బి తెరకెక్కించిన చిత్రం ‘ఐక్యూ’. పవర్ ఆఫ్ స్టూడెంట్.. అన్నది ఉపశీర్షిక. కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. సుమన్, సత్య ప్రకాష్, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది సినిమా స్టోరీ గా చెప్పొచ్చు.
చక్రవ్యూహం..
అజయ్ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్ తెరకెక్కించిన చిత్రం ‘చక్రవ్యూహం’. ది ట్రాప్.. అనేది ఉపశీర్షిక. సహస్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ‘‘మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో అజయ్ పోలీస్‌గా కనిపిస్తారు’’ అని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీ వేదికగా విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు (Upcoming Releases)..
నెట్‌ఫ్లిక్స్..
ఫేక్ ప్రొఫైల్ (వెబ్‌సిరీస్) మే 31
ఎ బ్యూటిఫుల్ లైఫ్ (హాలీవుడ్) జూన్ 1
న్యూ ఆమ్‌స్టర్ డామ్ (వెబ్‌సిరీస్) జూన్ 1
ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్) జూన్ 1
స్కూప్ (హిందీ సిరీస్) జూన్ 2
మ్యానిఫెస్ట్ (వెబ్‌సిరీస్) జూన్2
జీ 5..
విశ్వక్ (తెలుగు) జూన్ 2
డిస్నీ+ హాట్‌స్టార్..
సులైకా మంజిల్ (మలయాళం) మే 30
బుక్ మై షో..
ఈవిల్ డెడ్ రైజ్ (హాలీవుడ్) జూన్ 2
జియో సినిమా..
అసుర్ 2 (హిందీ సిరీస్) జూన్ 1