Up Coming Movies: ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
హిట్2
శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిరినేని నిర్మాతగా అడవి శేష్, మీనాక్షి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం హిట్2 (HIT2). ఈ సినిమాలో రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎంఎం శేలేఖ, సురేశ్ బొబ్బిలి ఈ మూవీకి సంగీతం సమకూర్చారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మట్టి కుస్తీ
తమిళ దర్శకుడు మరియు హీరో అయిన విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తమిళ సినిమాను తెలుగులో మట్టి కుస్తీ పేరుతో మాస్ మహారాజ రవితేజ నిర్మాత వ్యవహరిస్తూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో కరుణాస్, గజరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిచారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జల్లికట్టు బసవ
విజయ్ సేతుపతి, బాబీ సింహా, తాన్య రవిచంద్రన్, కిషోర్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తూ తెలుగులోకి డబ్ అవుతున్న మరో తమిళ చిత్రం జల్లికట్టు బసవ. ఈ సినిమాకు ఆర్.పన్నీర్ సెల్వన్ దర్వకత్వం వహించిగా ఈ మూవీ కూడా డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు రానుంది
నేనెవరు?
బాలకృష్ణ కోల, ప్రభాకర్, రావు రమేశ్, తాగుబో రమేశ్, గీతా షా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం నేనెవరు. ఈ మూవీకి భీమినేని శివ ప్రసాద్ నిర్మాతగా నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా కూడా డిసెంబర్ 02న రిలీజ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- క్రైమ్ సీన్ టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 29
- మై నేమ్ ఈజ్ వెండెట్టా మూవీ నవంబరు 30
- ట్రోల్ మూవీ డిసెంబరు 1
- జంగిల్‌లాండ్ (హాలీవుడ్) డిసెంబరు 1
- గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2
డిస్నీ+హాట్‌స్టార్
- విల్లో (వెబ్‌సిరీస్) నవంబరు 30
- రిపీట్ (తెలుగు) డిసెంబరు 1
- డైరీ ఆఫ్ ఎ వింపీకిడ్: రోడ్రిక్ రూల్స్ డిసెంబరు 2
- ఫ్రెడ్డీ (బాలీవుడ్)డిసెంబరు 2
- మాన్‌స్టర్ (మలయాళం) డిసెంబరు 2
జీ5
- ఇండియన్ లాక్‌డౌన్ (బాలీవుడ్) డిసెంబరు 2
- మాన్‌సూన్ రాగా (బాలీవుడ్) డిసెంబరు 2
ప్రైమ్ వీడియో
- క్రష్డ్ (వెబ్‌సిరీస్ సీజన్2) డిసెంబరు 2
- కాంతార (తుళు భాషలో) డిసెంబరు 2
- వదంతి (వెబ్‌సిరీస్) డిసెంబరు 2
ఇదీ చదవండి: నా వారసుడు వచ్చేస్తున్నాడు- బాలకృష్ణ