Site icon Prime9

Ram Charan wins NDTV True Legend Award: రామ్‌చరణ్‌ కు ట్రూ లెజెండ్‌ అవార్డు.. గర్వంగా ఉందన్న మెగాస్టార్

Ram Charan

Ram Charan

Ram Charan : వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా అవార్డులను అందజేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ట్రూ లెజెండ్‌ అవార్డు అందుకున్నారు.

చరణ్‌ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘నాన్నా చరణ్‌.. ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా ట్రూ లెజెండ్‌ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇలానే ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు రామ్‌చరణ్‌ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చరణ్‌కు కంగ్రాట్స్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం బడా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తాజాగా న్యూజిలాండ్ లో షెడ్యూల్ ను ముగించుకుంది. తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Exit mobile version