Site icon Prime9

Tollywood: బాక్సాఫీస్ వద్ద వార్.. గెలిచేది ఎవరు?

tollywoood prime9news

tollywoood prime9news

Tollywood: మంచు విష్ణు, విశ్వక్ సేన్, శివ కార్తికేయన్, కార్తీ ఇలా హీరోలంతా కూడా ఒకే వారంలో బరిలోకి దిగబోతోన్నారు. ఈ వారంలో  అంటే అక్టోబర్ 21న నాలుగు సినిమాలు  సందడి  చేయబోతోన్నాయి. ప్రతీ సినిమా మీద ఒక ఉంది. ఈ నాలుగు సినిమాల్లో  ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో…ఏ సినిమా హిట్టు కొట్టి   బరిలో నిలబడుతుందో అన్నది వేచి  చూడాలి. కార్తీ, శివ కార్తీకేయన్ సినిమాలు  తమిళ, తెలుగు భాషల్లో రాబోతోన్నారు.

శివ కార్తికేయన్ ప్రిన్స్  సినిమా విడుదల అవ్వకముందే  తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది .జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా  ప్రిన్స్  సినిమా  మీద మంచి క్రేజ్ నెలకొంది. జాతి రత్నాలు సినిమా  రేంజ్‌లో ఫన్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు జనాలు.ఇక కార్తీ సర్దార్ సినిమా మీద కూడా భారీ మంచి అంచనాలే ఉన్నాయి.ఈ సినిమాలో  కార్తీ గెటప్స్ చూస్తుంటే సినిమా చూడాలనే  ఇంట్రెస్ట్ అందరికీ  ఏర్పడింది.

ఇక తమిళంలో బ్లాక్  బాస్టర్ హిట్  ఐనా  ఓ మై కడవలే సినిమాను తెలుగులో ఓరి దేవుడా అంటూ రీమేక్ చేశారు.ఈ సినిమాలో  విశ్వక్ సేన్ హీరోగా  నటించాడు. అశోక వనంలో అర్జునకళ్యాణం వంటి కూల్ హిట్ తరువాత విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటించారు.అందుకే ఈ సినిమా మీద కూడా భారీ  అంచనాలే ఉన్నాయి.మంచు విష్ణు చాలా రోజుల గ్యాప్ తీసుకొని  జిన్నా సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోన్నారు. మరి ఈ సినిమా హిట్టు కొడుతుందో? లేదో ?చూడాలి.  బాక్సాఫీస్ బరిలోనూ ఎవరు గెలనున్నారో ?  అన్నది చూడాలి.

Exit mobile version