Site icon Prime9

Spark Movie: ప్రేక్షకులలో “స్పార్క్” బజ్… యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మూవీ

spark movie updates

spark movie updates

Spark Movie: వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా  ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ ఈ సినిమాను రూపొందిస్తోంది. కాగా ఈ చిత్రంలో ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా నటిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

అరవింద్‌ కుమార్‌ రవివర్మ ఈ సినిమాతో దర్శకుడిగా సినీపరిశ్రమకు పరిచయమవుతున్నారు. రవివర్మ ఇంతకుముందు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ అనుభవంతోనే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం స్పార్క్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. “హృద‌యం” ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ మూవీకి ట్యూన్స్ అందిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా ఆడియన్స్ ముందు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ మూవీలో నాజర్, సుహాసిని, షియాజీ షిండే, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం అంతా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

ఇదీ చదవండి: Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

Exit mobile version