Site icon Prime9

Yashoda: బెస్ట్ ఆఫ్ లక్ టూ “యశోద”.. థ్రిల్లింగ్ గా మూవీ మేకింగ్

yashoda-movie-making-photos-goes-viral

yashoda-movie-making-photos-goes-viral

Yashoda: దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించిన యశోద మూవీ మరో రెండు రోజుల్లో విడుదలకాబోతుంది. 11 నవంబర్ 2022న దేశవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తమ అనుభవాలను నెట్టింట షేర్ చేసుకున్నారు. యశోద మూవీ మేకింగ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ విజువల్స్ ని మరో రెండు రోజుల్లో మీరు ఆన్ స్క్రీన్ పై చూస్తారు అంటూ బెస్ట్ ఆఫ్ లక్ యశోద అంటూ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇకపోతే యశోద మూవీలో సమంత అద్భుతమైన నటన అందరినీ అబ్బురపరుస్తుందని చిత్ర బృందం అంటున్నారు. సరోగసి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ పోస్టర్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదలవుతుందా అని సినీలవర్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: అన్వితగా మారిన అనుష్క

 

 

Exit mobile version