Site icon Prime9

Devi Sri Prasad: సంక్రాంతి బరిలో ఇటు దేవిశ్రీ ప్రసాద్ అటు తమన్.. మ్యూజిక్ రచ్చలేపేదవరు

devi sri prasad thaman

devi sri prasad thaman

Devi Sri Prasad: మెగాస్టార్‌ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా చిరుకు రాక్ స్టార్ డీఎస్పీ, బాలయ్యకు తమన్ మ్యూజిక్ అందించారన్న విషయం విదితమే.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారని చెప్పవచ్చు. ఎవరికి వారు ఎప్పటికప్పుడు తమ సరికొత్త మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటారు. అటు మాస్ ఇటు క్లాస్ ఏ రకమైన బీట్స్ అయిన తమదైన స్టైల్లో కంపోజ్ చేస్తూ మ్యూజిక్ లవర్స్ ను ఆకర్షిస్తూనే ఉంటారు. ఊర మాస్ సాంగ్స్ నుంచి ఐటమ్ సాంగ్స్ చేయటంలోను వారివారి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు డీఎస్పీ, తమన్.

తమన్ బీట్స్ .. దేవిశ్రీ రాక్ సాంగ్స్ మధ్య ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు పోలిక పెడుతూనే వస్తోన్నారు. అయితే ఈ సారి కూడా వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇటు తమన్ సంగీతాన్ని అందించిన ‘వీరసింహారెడ్డి’.. అటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో నిలబడుతున్నాయి. ఒకరోజు తేడాతో ఈ రెండు బిగ్ మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి.

thaman

బాలయ్య ‘వీరసింహారెడ్డి’.. చిరూ ‘వాల్తేరు వీరయ్య’ ఈ రెండు సినిమాలు కూడా మాస్ యాక్షన్ జోనర్లో వస్తున్నాయి. అందువల్లే ఈ సారి మాస్ సాంగ్స్ హవా ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ దిశగా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య గట్టిపోటీ ఉండనున్నట్టే తెలుస్తోంది. మరి ఈ సంక్రాంతికి ఎవరు ఎక్కువగా సందడి చేయనున్నారనేది చూడాలి.

 

Exit mobile version