Site icon Prime9

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య.. రవితేజతో కలిసి స్టెప్పులేసిన మెగాస్టార్

Waltheru Veeraiah

Waltheru Veeraiah

Tollywood: మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రాల కోసం విభిన్న తారలను ఎంపిక చేసుకోవాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. అతను సల్మాన్ ఖాన్‌తో “గాడ్ ఫాదర్”లో ఒక సీక్వెన్స్ కోసం మరియు మగధీర లో బంగారు కోడిపెట్ట అంటూ  రామ్ చరణ్‌తో జతకట్టారు. ఇపుడు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి స్టెప్పులేసారు.

దీపావళి కానుకగా విడుదల చేసిన వాల్తేరు వీరయ్య టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇపుడు చిరంజీవి, రవితేజల పై ఓ మాస్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. చిరు మరియు రవితేజ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ చూడటం కంటే అభిమానులకు పండుగ ఇంకేముంటుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని పర్యవేక్షించారు. వాల్తేర్ వీరయ్య ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్, ఇందులో చిరంజీవి మాస్ గెటప్ లో  కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేర్ వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి విడుదల కానుంది.

Exit mobile version