Site icon Prime9

Vishwak Sen: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఫస్ట్ లుక్ రిలీజ్

Dhamki

Dhamki

Tollywood: ఓరి దేవుడా అనే హిట్ మూవీ తర్వాత, ఇప్పుడు విశ్వక్ సేన్ సినీ ప్రేమికులను అలరించేందుకు యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమ్కీతో వస్తున్నాడు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతున్న దస్ కా ధమ్కీ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా విశ్వక్ సేన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ధమ్కీ చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గురువారం ధమ్కీ మేకర్స్ విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను  రిలీజ్ చేసారు.

చేతికి గోల్డెన్‌ కలర్‌ వాచ్‌, మెడలో చైన్ తో కనుబొమ్మలను ఎగరేస్తూ, స్టైల్ గా, ఉన్న విష్వక్ లుక్ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

 

Exit mobile version