Site icon Prime9

Vishwak Sen: ఓరి దేవుడా అవుననవా.. పాట ఎంత బావుందో!

ori devuda prime9news

ori devuda prime9news

Tollywood: విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరి దేవుడా సినిమా నుంచి “అవుననవా ” పాట విడుదలైన సంగతి మనకి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమాకు ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా వ్యవహరించగా, అశ్వ‌త్ మారి ముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో వెంకటేష్, దేవుడు పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత ఈ సినిమా పై ప్రేక్షకుల్లో సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని అటు టాలీవుడ్ వాళ్ళు,ఇటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్త‌య్యింది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నట్టు తెలిసిన సమాచారం. ఓ వైపు సినిమా ప్రొడ‌క్ష‌న్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అవుననవా లిరిక్స్ ”ఏమ‌ని అనాల‌ని తోచ‌ని క్ష‌ణాలివి, ఏ మ‌లుపు ఎదురయ్యే ప‌య‌న‌మిదా, ఆమ‌ని నువ్వేన‌ని నీ జ‌త చేరాల‌ని, ఏ త‌ల‌పో మొద‌ల‌య్యే మౌన‌మిదా, ఔన‌న‌వా ఔన‌న‌వా” అంటూ ఒక ప్రేమికుడు త‌న ప్రియురాలికి మ‌న‌సులోని మాట‌ల‌ను పాటరూపంలో చెబితే ఇలా ఉంటుందన్నట్టుగా ఉన్నాయి.

 

Exit mobile version