Upasana: ఉపాసన త్వరలో మెగావారసులను ఇవ్వనున్నదన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన 10 ఏళ్ళ తరువాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నదన్న వార్తతో మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా మరికొన్ని నెలలో మెగా ఇంటిలో బుల్లిబుల్లి అడుగులు పడునున్నాయి. ప్రస్తుతం నిండు గర్భవతిగా ఉన్న ఉపాసన ఇంటి వద్దే ఉంటూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ వస్తుంది. కాగా మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
వారసత్వం కోసం కాదు(Upasana)
“సరైన సమయంలో నేను మాతృత్వాన్ని స్వీకరించినందుకు గర్వపడుతున్నాను. సమాజం కోసం లేదా మా వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో.. నేను నా బిడ్డకు జన్మని ఇవ్వాలని అనుకోలేదు. నా బిడ్డకు ప్రేమ, సంరక్షణను అందించడానికి నేను మానసికంగా సిద్ధమైనప్పుడే జన్మనివ్వాలని నిర్ణయించుకున్నా” అంటూ ఉపాసన రాసుకొచ్చింది. తమ మొదటి బేబీ గురించి అనౌన్స్ చేసినప్పడు చరణ్ అండ్ ఉపాసన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. కాగా వాటన్నిటికీ సమాధానం ఇచ్చినట్టే ఈ పోస్ట్ కామెంట్స్ ఉండడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా ఆగష్టులో ఉపాసనకు డెలివరీ డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదంతా ఇలా ఉంటే మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ కు పుట్టబోయే బేబీ వారసుడా? వారసురాలా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే బిడ్డ పుట్టాక రామ్ చరణ్ కొంతకాలం షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వనున్నాడట. తమ బేబీతో కొంత సమయం గడిపిన తర్వాతే మళ్ళీ షూటింగ్స్ పాల్గొననున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లలో రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాలో నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం.