Site icon Prime9

Priyanth Rao: జూనియర్ ఆర్టిస్ట్ పై రేప్.. ఆ హీరో అరెస్ట్

tollywood 2 prime9news

tollywood 2 prime9news

Tollywood: సినీ పరిశ్రమలో రంగుల ప్రపంచం ఇక్కడ వెలిగిపోవాలని అనేక మంది ఎక్కడెక్కడి నుంచో సినిమాల్లోకి అనేకమంది వస్తూ ఉంటారు. ఐతే వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో సినిమాలలో మెరుస్తూ ఉంటారు. మిగతా వారందరూ ఏదో ఒక పని చేస్తూ స్థిరపడడమో లేక సినీ పరిశ్రమలోనే ప్రయత్నాలు చేస్తే ఏదో ఒక అవకాశం రాకపోతుందా అని కాంప్రమైజ్ అవ్వడమో చేస్తూ ఉంటారు.

ఇక తాజాగా ప్రేమ పేరుతో తనను నమ్మించి అత్యాచారం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కొన్ని నెలలు నుంచి పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి కొత్తగా మా ప్రయాణం అనే సినిమాతో ప్రియాంత్ రావు అనే వ్యక్తి తెలుగు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంత్ కు ఒక జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గర అయి, అప్పటినుంచి ఆమెను ఇష్టం వచ్చినట్టు శారీరకంగా వాడుకుంటూ వచ్చాడు. ఆ బాధితురాలు నెల తప్పడంతో ప్రియాంత్ ఆమె దగ్గరకు వెళ్ళడం మానేశాడు.

Exit mobile version