Megastar Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఛర్మీషాను కోల్పోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈయన గత కొంతకాలంగా తన సినిమాల కోసం పక్కహీరోల మీదే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదనే చెప్పాలి. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా భారీ లాభాలను అయితే రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తన ప్రతి సినిమాలో మరో హీరోకు చోటు కల్పిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు నటించిన ప్రతి సినిమాలో మరో ఫేమస్ హీరో నటించడం మనం చూస్తూనే ఉన్నాం. సైరా నరసింహారెడ్డి సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, బిగ్ బీ అమితా బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చ లాంటి హీరోలు నటించగా.. ఆచార్య సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి చిరంజీవి స్క్రీన్ పంచుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలోనూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను మరో లీడ్ క్యారెక్టర్ కోసం తీసుకువచ్చారు చిరు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదలకానుంది. ఈ సినిమాలో కూడా చిరంజీవి, మాస్ ఇమేజ్ ఉన్న మరో హీరోను తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహరాజా రవితేజ వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారని సమాచారం. సుమారు 40 నిమిషాల నిడివి ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా నటించిన రవితేజ చాలా కాలం తర్వాత మరోసారి మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో వాల్తేరు వీరయ్య మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అదీకాక తాజాగా రవితేజ హీరోగా నటించిన ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య మూవీకి రవితేజ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడనే టాలీవుడ్ టాక్. మరోవైపు చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలోనూ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లాంటి యాక్టర్ నటిస్తుండటం విశేషం. ఇక వీటన్నింటి చూస్తున్న ప్రజలు సినీ విశ్లేషకులు చిరంజీవికి సినిమాల్లో సోలోగా నటించడం ఇష్టం లేదని అందుకే ఇలా తన ప్రతి సినిమాలోనూ మంచి క్రేజ్ ఉన్న నటీనటుల సపోర్ట్ కోరుతున్నారంటూ టాక్.
ఇదీ చదవండి: బాలకృష్ణ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ దెబ్బకు థింకింగ్ మారిపోద్ది