Site icon Prime9

పూజాహెగ్డే: కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న పూజాహెగ్డే.. జేమ్స్ బాండ్ హీరోయిన్ లుక్స్ తో టాలీవుడ్ బుట్టబొమ్మ

pooja hegde stunning loks goes viral

pooja hegde stunning loks goes viral

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ, స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే మరోసారి తన రొమాంటిక్ లుక్స్‌తో నెటిజన్లను ఉర్రూతలూకిస్తోంది. తాజాగా పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో థైస్ కనిపించేలా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్‌లో హాలీవుడ్ జేమ్స్‌బాండ్ సినిమాల్లో హీరోయిన్‌లా కనిపిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

బ్లాక్ డ్రెస్ మరియు బ్లాక్ స్పెక్ట్స్ బ్లాక్ షూస్ తో బ్లాక్ కారులో డోర్ తీస్తూ హాట్ హాట్ ఫోజులిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజలను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో రాధ్యే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలతో వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయింది పూజా హెగ్డే. దానితో ఈ బ్యూటీకి మూవీ ఆఫర్లు కూడా తగ్గాయనే చెప్పాలి. దానితో ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఈ తన అందాల ఆరబోతతో చెప్పకనే చెప్తోంది.

pooja hedge latest photos

ఇకపోతే పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలోని గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
కాగా తెలుగులో పూజాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో పూజా.. అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేయగా అవి ఇండస్ట్రీ నాట సూపర్ హిట్స్ గా నిలిచాయి. దానితో ఒక్కసారిగా పూజా టాలీవుడ్‌లో ఉన్న అగ్రహీరోలను వరుసగా లైన్లో పెడుతూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపింది. దానితో టాలీవుడ్ నాట పూజాది గోల్డెన్ లెగ్గ్ అని ముద్ర పడిపోయింది.

pooja hedge hot looks

అయితే ఆ తర్వాత వరుసగా హిట్‌ సినిమాలు వచ్చినట్లుగానే వెంటనే వెంటనే ఫ్లాప్‌లు కూడా రావడంతో ఈ అమ్మడిని ఓకే చేయడానికి దర్శక, నిర్మాతలు కాస్త ఆలోచిస్తున్నారు. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా క్రేజీ హీరోయిన్‌గా అతి తక్కువ టైమ్‌లో పూజాహెగ్డే పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంనూ తగ్గేదేలే అంటోంది అమ్మడు. ఈ మధ్య కాలంలో పొట్టి డ్రెస్‌లు, రెండు ముక్కల మోడ్రన్ డ్రెస్సుల్లో కుర్రాళ్ల మతిపోగొడుతోంది పూజాహెగ్డే. మరి నెక్స్ట్ ప్రాజెక్టులు అయినా పూజాకు కలిసివస్తాయా.. 2023లో నెంబర్ హీరోయిన్‌గా మళ్లీ సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో వేచి చూద్దాం.

ఇదీ చదవండి: పవన్ అభిమానులకు పూనకాలే.. హరిహర వీరమల్లు సెట్లో బాలీవుడ్ యాక్టర్ బాబీడియోల్

Exit mobile version