Site icon Prime9

Yashoda Teaser: యశోద టీజర్ అవుట్.. అదరగొట్టిన సామ్..!

yashoda movie teaser prime9 news

yashoda movie teaser prime9 news

Tollywood: టాలీవుడ్ లో ప్రముఖ కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందించబడిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టీజర్ ను రిలీజ్ చేసింది.

అయితే ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించింది. అయితే డాక్టర్, సమంతను గర్భవతిగా ఉన్నప్పుడు ఏఏ పనులైతే చేయొద్దని చెప్తుందో, అలాంటి పనులే చేస్తూ సమంత ఈ టీజర్ లో కనిపిస్తుంది. సామ్ ను ఎవరో చంపడానికి ప్రయత్నించడం, వాళ్ళ నుంచి తను తప్పించుకుంటూ విలన్స్ తో ఫైట్ చెయ్యడం వంటి సన్నివేశాలను ఈ టీజర్ లో చూపించింది చిత్ర బృందం. అయితే ఈ టీజర్ విడుదలైన కొద్ది సమయానికే అత్యంత ప్రేక్షకాదరణను చూరగొనింది. దానితో యశోద సినిమా మీద మరింత బజ్ క్రియేట్ అయ్యిందనే చెప్పవచ్చు. మరి ఇందులో అసలు సామ్ ను ఎవరు ఆమెను ఎవరు చంపడానికి చూస్తున్నారదే ఈ చిత్రం విడుదలైతే కానీ తెలియదు.

యశోద సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఈ చిత్రంపై మరింత ఉత్కంఠతను పెంచేశాయి. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద హరి హరీష్‌ డైరెక్టర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

Exit mobile version