Site icon Prime9

Censor Board: సెన్సార్ బోర్డు సభ్యుడిగా శ్రీహరి తమ్ముడు ఆర్. శ్రీధర్

Srihari's younger brother R. Sridhar is a member of the Censor Board

Tollywood: ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాలకు పైగా చేశారు. నిర్మాతగా కూడా పలు సినిమాలు చేపట్టారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తనకు లభించిన పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని పేర్కొన్నారు. అవకాశం కల్పించిన కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్, తెలంగాణ భాజపా అధ్యక్షులు బండి సంజయ్ లకు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నిర్మాతలు నట్టి కుమార్, జె.వి.మోహన్ గౌడ్ తదితరులు శ్రీధర్ కు శుభాకాంక్షలు అందచేశారు.

ఇది కూడా చదవండి: Akkineni Nageshwar Rao: 250 స్క్రీన్ల పై ఏఎన్ఆర్ నటించిన “ప్రతిబింబాలు”.. తెరకెక్కించి 4 దశాబ్ధాలు

Exit mobile version