Site icon Prime9

Sreeleela: అందరి చూపు పెళ్లి సందD హీరోయిన్ పైనే!

sreeleela prime9news

sreeleela prime9news

Tollywood: పెళ్లి సందD సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఈ ముద్దుగుమ్మ తీసింది ఒక్క సినిమానే ఐనా తెలుగు ప్రేక్షాధారణ పొంది పెళ్లి సందD సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె రవితేజ సరసన ధమాకాలో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ రీసెంటుగా సైమా అవార్డ్‌ అందుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కుర్ర హీరోల కన్ను ఈమె పై కన్నుపడి హీరోయిన్‌గా కావాలని రికమెండ్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలో  హీరోయిన్‌గా చేస్తున్న శ్రీలీలకు వరుస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎవరు వచ్చినా అభిమానులు వారికే జై కొడుతున్నారు. అలాగే ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న విషయం మన అందరికీ తెలిసిందే.

గతంలో కృతి శెట్టి కూడా ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎలా మారిందో. అలాగే ఇప్పుడు పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పరిస్థితి కూడా అలానే ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. పెళ్లి సందD సినిమా శ్రీలీలకు క్రేజ్ ను, పాపులారిటీ, మంచి పేరు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో కూడా చింపేయ్ గలదు. ఈ అమ్మడుకు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

 

Exit mobile version