Site icon Prime9

Allu Sneha Reddy: స్నేహ రెడ్డి సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్

allu arjun prime9news

allu arjun prime9news

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని సైతం తలదన్నే అందం అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సొంతం. ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి ఐనప్పటికి ఈమె అందం కొంచం కూడా తగ్గలేదు. ఈమె మోడ్రన్ గా రెడీ ఐతే ఈమె అందం ముందు ఏ స్టార్ హీరోయిన్ కూడా సరిపోదు. ఇంకా చెప్పాలంటే పూజ హెగ్డే, రష్మిక వంటి స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునే స్థాయి స్నేహ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి  ఇప్పటి వరకు స్పందించలేదు. ఐతే ఇప్పుడు హీరోయిన్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో హాట్ టాపిక్. ఆమె ఎంట్రీకి అల్లు అర్జున్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

Exit mobile version