Site icon Prime9

Samantha: నటి సమంత ప్రత్యేక పూజలు

Samantha-performs-Special-Pooja

Tollywood: నటి సమంత ఇటీవల కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పూజారుల బృందం పాల్గొని ఆమెను ఆశీర్వదించారు. సమంత పూజకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె పూజకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆమె తన మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోయినప్పటినుంచి మానసికంగా ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె బయటకు సంతోషంగా కనిపించినప్పటికీ, ఆమె లోపల బాధను అనుభవిస్తోందని సన్నిహితులు అంటున్నారు. ఆమె పూజలు చేయడం వెనుక ఇవన్నీ కారణాలు కావచ్చని సమాచారం

సమంత బాలీవుడ్‌ లో అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఆమె నటించిన యశోద త్వరలో విడుదలవుతోంది. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో, పుష్పలో తన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాతో ఉత్తరాదిన మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Exit mobile version