Site icon Prime9

Shaakuntalam: సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. శాకుంతలం మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

shaakuntalam movie release date announced

shaakuntalam movie release date announced

Tollywood: సమంత అభిమానులకు గుడ్ న్యూస్. శాకుంతలం మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. అందాల తార సమంత కీలక పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ రిలీజ్​ డేట్ను మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకచించింది. నవంబర్‌ 4న ఈ చిత్రం థియోటర్ల వద్ద సందడి చేయనుంది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త ఫొటో‌తో పాటు ఓ మోషన్‌ పోస్టర్‌ను అభిమానుల కోసం షేర్ చేసింది.

పురాణాల నేపథ్యంలో మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథను ఆధారంగా చేసుకుని ‘శాకుంతలం’ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యువ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్​ కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర పోషిస్తోంది.

ఇదీ చదవండి: తెరపై కృష్ణ వ్రింద విహారిపై మ్యాజిక్… ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటూ రివ్యూ..!

Exit mobile version