Site icon Prime9

Samantha: యశోదలో సమంత యాక్షన్ సీన్స్ అదుర్స్

samantha-yashoda-film-completed-censor-work

samantha-yashoda-film-completed-censor-work

Tollywood: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు చేసిన చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై యశోద సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హరి, హరీష్ దర్శకత్వం వహించిన యశోద సినిమాలో అగ్రనటి సమంత టైటిల్ పాత్రను పోషిస్తున్నారు.

పాన్ ఇండియాగా తెర పైకి ఎక్కించిన యశోద చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలను కూడా పెంచింది. ఇందులో సమంత ప్రదర్శించిన యాక్షన్ సీన్స్ సినిమాకు మంచి మైలేజ్ ను తెప్పించనున్నాయి.

నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న యశోద సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సీన్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. అందులో సమంత ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చేయడం అంటే అతిశయోక్తి కాదు. అయినా సమంత డెడికేషన్ నడుమ ఫైటింగ్ ను చేయడం అభిమానులకు మంచి కిక్కును ఇవ్వనుంది.

యశోద యాక్షన్ మూవీ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ సమంత గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నటులకు యాక్షన్ కొరియోగ్రఫీ గురించి కీలకంగా తెలియాలన్నారు. అందుకోసం డూప్ ల సాయంతో ఫైట్ ను ముందుగా చూపిస్తాం, అనంతరం నటీనటులకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంలో సమంత చాలా చక్కగా ఫైట్ సీన్స్ లో నటించిన్నట్లు యానిక్ బెన్ తెలిపారు. ప్రతి షాట్ కు ఆమె చేసిన స్టైల్ యాక్షన్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకొంటుందన్నారు. యశోద మూవీలో స్టంట్స్ రియల్ గా ఉంటాయన్నారు. యాక్షన్ లో రియాల్టీని సమంత చూపించిందన్నారు. కిక్ బాక్సింగ్, జూడో, మార్షల్ ఆర్ట్స్ నడుమ యాక్షన్ సీన్స్ యశోద సినిమాలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tollywood Releases This Week: ఈ వారంలో పది సినిమాలు రిలీజ్

Exit mobile version