Site icon Prime9

Kantara enters 300cr club: రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన “కాంతార”

kantara enters 300cr club

Rishab Shettys Kantara: రిషబ్ శెట్టి పీరియాడికల్ డ్రామా చిత్రం “కాంతార” విడుదలై దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ ఇంకా రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం రిషబ్ శెట్టి అందించారు మరియు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రానికి నిర్మించారు.

ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అలానే మరో 50 కోట్లు సంపాదించే అవకాశం ఉందని తెలుస్తుంది. మాగ్నమ్ ఓపస్ భారతదేశంలోనే 200 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసింది మరియు త్వరలో 250 కోట్ల రూపాయలకు చేరుకోనుంది. ఈ చిత్రం కేవలం కన్నడ వెర్షన్‌లో సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. తరువాత, ఈ చిత్రం అక్టోబర్ 14న తమిళం, తెలుగు మరియు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లలో విడుదలైంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకు 22 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్త కలెక్షన్ బాక్సాఫీస్ వద్ద (అన్ని భాషలతో కలిపి) రూ. 307.56 గ్రాస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

ఇటీవలి నివేదికల ప్రకారం, నవంబర్ 4న హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.

Exit mobile version