Site icon Prime9

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం !

rashmika prime9news

rashmika prime9news

Tollywood: ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ పుష్ప సినిమా ద్వారా పాపులర్ అయి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. గూగుల్లో రష్మిక అని పేరు కొట్టగానే నేషనల్ క్రష్ అని వస్తుంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంది. త్వరలోనే రష్మిక బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గర కానుంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది కాకుండా సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’ అనే సినిమాకు కూడా సైన్ చేసింది. త్వరలో అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో చేరనుందని తెలిసిన సమాచారం.

రష్మిక మందన్నా రెమ్యూనరేషన్‌పై పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పుష్ప-2 సినిమా కోసం ఈమె రెమ్యూనరేషన్ను అమాంతం పెంచేసిందని టాలీవుడ్లో గుస గుసలాడుకుంటున్నారు. ఈ సినిమాకు ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసిన సమాచారం. అలాగే ఇప్పటి నుంచి ఆమె చేసే ప్రతి సినిమాకు కూడా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుందని తెలిసిన సమాచారం. పుష్ప-1 సినిమా హిట్ ఐనా ఊపులో ఈ సినిమాకు రెమ్యూనరేషన్‌ పెంచిందని తెలిసిన సమాచారం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఈ అమ్మడు ముందుకు దూసుకెళ్తుంది.

Exit mobile version