Site icon Prime9

Nagavamshi: మహేష్-త్రివిక్రమ్ గురించి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత నాగవంశీ.. రిలీజ్ డేట్ అప్పుడే?

nagavamshi about ssmb 28

nagavamshi about ssmb 28

Nagavamshi: సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది.

సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా గ‌త ఏడాది లోనే స్టార్ట్ అయ్యింది.

ఓ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అయితే ఇంకా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాలేదు.

మహేష్ బాబు తదనరీ సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది లోనే వరుసగా ముగ్గురిని మహేష్ బాబు కోల్పోవడం అందరికీ బాధ కలిగిస్తుంది. దీంతో మహేష్ నటనకు కొంత గ్యాప్ తీసుకున్నారని తెలుస్తుంది.

కాగా ఇప్పుడు తాజాగా మహేష్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు నిర్మాత నాగవంశీ.

మరోవైపు నిర్మాత నాగవంశీ మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’.

శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. పలు సినిమాల్లో అజిత్ కి కూతురి క్యారెక్టర్స్ లో నటించి.. తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది “అనిఖా సురేంద్రన్”.

కాగా ఇటీవల నాగార్జున హీరోగా వచ్చిన ఘోస్ట్ చిత్రంలో కూడా మెప్పించింది ఈ భామ. అలానే అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి .. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

 

మహేష్ సరసన ఇద్దరంట..

ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ, అనిఖా సురేంద్రన్, చిత్ర బృందం.. యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

దీనిలో భాగంగా నాగవంశీ(Nagavamshi) SSMB28 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

మహేష్ బాబు గారి సినిమా గురించి ఫ్యాన్స్ కి ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు కదా అని సుమ ప్రశ్నించింది.

అందుకు బదులుగా నాగవంశీ.. ఈ నెల 18 నుంచి ‘SSMB28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చెప్పారు. అలానే ఈ ఏడాది ఆగష్టు 11న సినిమాని విడుదల చేస్తామని వెల్లడించాడు.

అలాగే మూవీలో హీరోయిన్స్ పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారని వెల్లడించారు. మేము ప్రకటించకుండానే సెకండ్ హీరోయిన్ గా ‘శ్రీలీల’ని తీసుకున్నట్లు.

మళ్ళీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఏవి నిజం కాదు. ఈ సినిమా కోసం శ్రీలీలని తీసుకున్న సంగతి నిజమే కానీ ఆమె సెకండ్ హీరోయిన్ అనేది అబద్ధం.

ఈ మూవీలో ఇద్దరి హీరోయిన్ లకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన కామెంట్స్ తో మహేష్ బాబు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version