Site icon Prime9

Pragya Jaiswal: చీరకట్టులో మెరిసిన బాలయ్య హీరోయిన్

tollywood heroine prime9news

tollywood heroine prime9news

Tollywood: ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసిన అవేమీ ఆమెకు అంతగా కలిసి రాలేదు. వాటిలో ఒక్కటి సక్సెస్ ఐనా ఈ అమ్మడు సినీ కెరీర్ బావుండేది. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఈ ముద్దుగుమ్మ వైపు ఎవరు చూడలేక పోవడం వల్ల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఐతే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టుతో కనిపించినా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

ఒక వైపు సినిమాలతో బిజీగా ఉండగా ఇంకో వైపు పెయిడ్ యాడ్స్‌తో రెండు చేతుల నుంచి సంపాదిస్తుంది. ఈ ముద్దు గుమ్మ గతేడాది హీరోయిన్‌గా నటించిన అఖండ సినిమా విషయానికి వస్తే, నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా భారీ అంచనాలతో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

 

Exit mobile version