Site icon Prime9

Prabhas Maruthi Movie: సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టేసిన ప్రభాస్ మారుతి సినిమా!

prabhas prime9news

prabhas prime9news

Tollywood: ఒక ప్రక్క ప్రభాస్ హీరోగా పలు భారీ ప్రాజెక్టులు మరోపక్క ఆయన సైలెంట్ గా చిన్న సినిమా ఒకటి చేస్తున్నారు. చాలా కాలంగా మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ ఒక కామెడీ సినిమా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ పూజ కూడా మొదలుపెట్టారని పలు వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలిసిన సమాచారం.

మొదటి షెడ్యూల్ లో మొత్తం మూడు రోజులు ప్రభాస్ షూటింగ్లో పాల్గొన్నారని తెలుస్తుంది. మిగతా నాలుగు రోజులు ప్రభాస్ లేకుండానే నటీనటుల పై కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు తెలిసిన సమాచారం. ఈ సన్నివేశాలు ప్రభాస్ కాంబినేషన్ రిద్ది కుమార్ అలాగే వైవా హర్ష అండ్ కో పాల్గొన్నట్లుగా తెలిసింది. ఇక ఈ సినిమా ఒక హర్రర్ కామెడీ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు దెయ్యం పడుతుందని ఆ తరువాత వచ్చే కామెడీ ప్రధానంగా ఈ సినిమా మొత్తం సాగుతుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

Exit mobile version