Site icon Prime9

Prabhas Adipurush: ఆదిపురుష్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్.. అప్డేట్ చూసి ఏడుస్తున్న జనం

prabas adipurush special poster

prabas adipurush special poster

Prabhas Adipurush: ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చేప్తూ దర్శకుడు ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు. మరియు ఆదిపురుష్ టీం నుంచి ప్రభాస్ రాముడి గెటప్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రభాస్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ఈ యంగ్ రెబల్ స్టార్ చేసిన వరుస చిత్రాలైన సాహో, రాధేశ్యామ్ వరుస ఫ్లాప్ లుగా మిగిలాయి. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం మంచి కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం డార్లింగ్‌ ఆశలన్నీ ఆదిపురుష్ పైనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ రాముడి గెటప్‌లో అదిరిపోయాడు. ఒక చేతిలో బాణం, మరో చేతిలో విల్లును పట్టుకుని యుద్ధ వీరుడుగా కనిపిస్తున్నాడు. మైథలాజికల్‌ కాన్సెప్ట్‌తో రామాయణాన్ని బేస్‌ చేసుకుని ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకుగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే దర్శకుడు ఓం రౌత్ చేసిన ట్వీట్ లో ప్రభాస్ కు పుట్టినరోజు విషెస్ చెప్పడంతో పాటు కేవలం ఈ చిత్రం జనవరి 12న కేవలం త్రీడీ, ఐమాక్స్ థియేటర్లోనే విడుదల అవుతుందంటూ చెప్పాడు. దానితో ప్రేక్షకులు దర్శకుడు మరియు చిత్ర బృందం పై విరుచుకుపడుతున్నారు. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చెయ్యకపోయినా బాగుండేది అంటూ ఏడుస్తున్న ఎమోజీలు పెడుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మరియు త్రీడీ, ఐమాక్స్ థియేటర్లలలోనే సినిమా విడుదల చేస్తే మరి మాములు ప్రజలు ఎక్కడి వెళ్లి చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: జపనీస్ భాషలో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Exit mobile version