Site icon Prime9

Bro Movie: అవును “బ్రో”.. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మూవీ టైటిల్ ఇదే

Bro Movie

Bro Movie

Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు, యంగ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మామ, మేనల్లుడు కలిసి కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం.

మామా బ్రో..!(Bro Movie)

తమిళంలో హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక ఈ మోషన్ పోస్టర్ ను పరిశీలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి స్టైలిష్ లుక్ లో కనిపించగా.. ఓవైపు టైం ట్రావెల్.. మరోవైపు పరమేశ్వరుడు దర్శనమివ్వడం కనిపిస్తుంది. ముఖ్యంగా మోషన్ పోస్టర్ మరింత ఎఫెక్ట్ ఇచ్చేలా తమన్ అందించిన మ్యూజిక్ అయితే మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉందని చెప్పవచ్చు. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ‘బ్రో’ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కాగా ఈ మూవీకి టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నారు.

 

అయితే ‘బ్రో’ సినిమా కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనే మెయిన్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. భగవంతుని పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన ‘గోపాల గోపాల’లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కనిపించి మెప్పించారు. ఇక ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కు తోడుగా ‘రొమాంటిక్’ కథానాయిక కేతికా శర్మ నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version