Site icon Prime9

Ponniyin Selvan 2: మణిరత్వం పొన్నియనస్ సెల్వన్-2 నుంచి అప్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ponniyin selvan 2 release date fix

ponniyin selvan 2 release date fix

Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా పొన్నియిన్‌ సెల్వన్‌-1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా పార్ట్‌-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ మరో అప్‌డేట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ గురించి ఆసక్తికర అప్‌డేట్‌ను రివీల్ చేసింది. పీఎస్ రెండో భాగం 2023, ఏప్రిల్‌ 28న విడుదల చెయ్యనున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ వీడియోలో ఆదిత్య కరికాలన్‌ (విక్రమ్‌), పొన్నియిన్‌సెల్వన్‌ (జయం రవి), వందియదేవన్‌ (కార్తి), నందిని (ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌) పాత్రలను చూపించారు. దానితో ఈ రెండో భాగం సినిమాలో వీరి పాత్రలే కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఫస్ట్ పార్ట్ లో దర్శకుడు మణిరత్నం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సుంద‌ర చోళుడి (ప్రకాశ్‌రాజ్‌)ని త‌ప్పించి మ‌ధురాంత‌కుడి (రెహమాన్‌)ని చ‌క్రవ‌ర్తిని చేయాలనుకున్న పళవేట్టురాయర్‌ (శరతకుమార్‌) కుట్ర భగ్నమైందా? పొన్నియిన్ సెల్వన్‌ (జయం రవి)ను ఖైదు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? నందిని (ఐశ్వర్యా రాయ్‌) ఎవ‌రు? ఆమెకు, పొన్నియిన్ సెల్వన్‌కీ, ఆదిత్య క‌రికాల‌న్‌ (విక్రమ్‌)కీ ఉన్న సంబంధం ఏంటి? కుందవై (త్రిష) ఎలాంటి వ్యూహం ఉపయోగించింది? తన మిత్రుడికి కోసం వందియదేవన్‌ (కార్తి) ఎలాంటి సాహసం చేశాడు? అనే విషయాలను రెండో భాగంలో అయినా మణిరత్నం చూపించనున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ వేచిచూడాలి.

ఇదీ చదవండి: ఆ పరిస్థితి వస్తే సినిమాల నుంచి రిటైర్ అవుతానన్న చిరంజీవి

Exit mobile version