Site icon Prime9

Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ #OG లో హీరోయిన్‌గా పూజాహెగ్డే ఫిక్స్ అయ్యిందా?

pawan kalyan OG movie heroine pooja hegde

pawan kalyan OG movie heroine pooja hegde

Pooja Hegde: ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు.

యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవలే వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే ఈ సినిమాలో పలు ఇండస్ట్రి లకు సంబంధించిన నటీనటులు నటిస్తున్నారు.

రోహిత్ శెట్టి, అనుపమ్ ఖేర్, ప్రకాష్ రాజ్, టబు, ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం అందుతుంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పవన్ కళ్యాణ్ ఓజీలో పూజాహెగ్డే..

ఈ తరుణంలోనే తాజాగా ఈ మూవీ లో పూజ హెగ్డే నటించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇందుకు కారణం ఏంటంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పూజా(Pooja Hegde) ఒక స్టోరీ పెట్టింది.

అందులో బ్యాక్ టూ ఓజీ అని రాసుకోచ్చింది.

సోషల్ మీడియాలో త్రివిక్రమ్, పూజా హెగ్డేల మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ అందరికీ తెలిసిందే. వరుసగా త్రివికమ్ తన సినిమాల్లో పూజా హెగ్డేనే పెట్టుకుంటున్నాడు.

దీంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్, మీమ్స్ వేసి గురూజీని ఆడేసుకుంటున్నారు.

ఈ సినిమాలో కూడా గురూజీనే బుట్టబొమ్మను రికమెండ్ చేసి ఉంటాడనే వ్యర్థాలుసిని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సూపర్ హిట్ కాంబో రిపీట్..

ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ తమన్ కొట్టేసిన విషయం తెలిసిందే.

తమన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

తమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకి మ్యూజిక్ అందించారు. ఈ రెండు సినిమాల్లో తమన్ కొట్టిన బీజీఎంకి పవన్ ఫాన్స్ ఫిదా అయ్యారు.

దీంతో తమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అదరగొట్టాలి అని.. హ్యాట్రిక్ సూపర్ హిట్ ఆల్బమ్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

మరోవైపు ఓజీ సినిమా ఎలా ఉండబోతుందనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ లో కొంత వరకే కనిపిస్తారని సెకండ్ ఆఫ్లో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందని అంటున్నారు.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకి .. ఈ సినిమాకి లింక్ ఉందట.. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారో లేదో సస్పెన్స్ గా చెబుతున్నారు.

ఆ మూవీ లోని పాత్రల గురించి అయితే ప్రస్తావిస్తారని టాక్ నడుస్తుంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ అనుభూతిని అందించేలా మూవీ మేకింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే సాంగ్స్, డ్యాన్స్ లేకుండానే మూవీ రన్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

అంతేకాకుండా ఈ మూవీ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సాహో మూవీ క్లైమాక్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు.

ఓజీ పోస్టర్‌లో జపానీస్ భాషలో రాసి ఉన్న ఆ అక్షరాల అర్థం అగ్నితుఫాన్‌ అని.

దీనిని బట్టి ఈ సినిమా కథ జపాన్‌, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version