Site icon Prime9

Pawan Kalyan: దర్శకుడు సుజిత్ కు ఓకే అన్న పవర్ స్టార్

pawan-kalyan-sujith

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరి కాంబోలో చిత్రం వస్తుందని గత కొద్దికాలంగా ఊహాగానాలు వెలువుడుతున్నాయి. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ థెరికి రీమేక్ అని కూడ టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రణాళికలు మారాయి. సుజిత్ ఇటీవల పవన్ కోసం అసలు స్క్రిప్ట్ వివరించాడు. దీనికి పవన్ ఓకే అన్నారు. దీనిపై ఒక వారంలో అధికారిక ప్రకటన వెలువడుతుంది. సెప్టెంబర్‌లో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.

ప్రస్తుతం డేట్స్ మరియు షూటింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌తో కలిసి డివివి దానయ్య ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ వినోదయ సీతం రీమేక్‌ని చేపట్టాలని ఆసక్తిగా ఉన్నాడు. అయితే ఫైనల్ స్క్రిప్ట్ సిద్దం కాకపోవడంతో ప్రాజెక్ట్ ఆలస్యం అయింది.

ఈ సినిమా దర్శకుడు సముద్రఖని కూడా యాక్టింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి సుజిత్ సినిమాతో వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నాడు. సుజిత్ రికార్డు స్పీడ్‌లో అన్ని లాంఛనాలు పూర్తి చేస్తున్నాడు. అయితే హరి హర వీర మల్లు చిత్రీకరణను పునఃప్రారంభించడం మరియు హరీష్ శంకర్ యొక్క భవదీయుడు భగత్ సింగ్ లపై ప్రస్తుతానికి ఎటువంటి అప్‌డేట్‌లు లేవు.

Exit mobile version