Site icon Prime9

Samantha thanks fans for Yashoda’s success: నా మనసు గాల్లో తేలుతోంది.. సమంత

Overjoyed Samantha Ruth Prabhu thanks fans for Yashodas success

Samantha Emotional note: సమంత రుతు ప్రభు తన మైయోసిటిస్ నిర్ధారణ గురించి తెలిపిన తర్వాత ఆ వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. అయితే, ఆమె వ్యాధితో బలంగా పోరాడుతూ హృదయాలను గెలుచుకుంది. సమంత నటించిన యశోదకి ప్రేక్షకుల దగ్గర నుండి మంచి స్పందన వస్తున్నందున సమంత ఒక ఎమోషనల్ నోట్ రాసింది. 

ప్రియమైన ప్రేక్షకులకు, ‘యశోద’ పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.

‘యశోద’ చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను.  నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది. సదా వినయపూర్వక కృతజ్ఞతలతో మీ సమంత అని పోస్ట్ చేసింది.

Exit mobile version