Site icon Prime9

Prabhas – Maruthi: ప్రభాస్ – మారుతి సినిమా నుంచి కొత్త అప్డేట్

prabhas maruthi prime9news

prabhas maruthi prime9news

Tollywood: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం మన అందరికీ సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఈ విషయాలు కూడా అధికారికంగా ఏ ప్రకటనలు కూడా బయటకు వెలువడలేదు. కానీ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసిన సమాచారం. తాజాగా మరో వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిన సమాచారం. ఐతే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇది కూడా నిజమే అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇంకా అగ్రిమెంట్ మీద సైన్ అయితే చేయలేదని సిని వర్గాల వారు అంటున్నారు. వీలైనంత త్వరగా ప్రభాస్ సినిమా పట్టాలఎక్కించాలని మారుతి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిన సమాచారం.

Exit mobile version