Site icon Prime9

Hari Hara veeramallu: హరి హర వీరమల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్

Hari Hara Veeramallu

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి రోజున హరి హర వీరమల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నట్లు తెలిసిన సమాచారం. హరి హర వీరమల్లు సినిమా యూనిట్ అప్డేట్ కి మంచి ముహుర్తం కూడా పెట్టేశారని తెలుస్తుంది. ఈ అప్డేట్ సెప్టెంబర్ 2న సాయంత్రం 5:45 గంటలకు విడుదల చేయనున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

హరి హర వీరమల్లు చిత్ర యూనిట్ ఈ కొత్త అప్డేట్ కు సంభందించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విడుదలైన ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ అభిమానులు వినాయకచవితి పండగతో పాటు తమ హీరో పోస్టర్ పండుగ కూడా చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్నుగా నటిస్తున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ,భారీ సెట్స్ వేస్తున్నారని తెలిసిన సమాచారం.2023 ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

Exit mobile version