Site icon Prime9

God Father: గాడ్ ఫాదర్ నుంచి నయనతార ఫస్ట్ లుక్

God Father

God Father

Tollywood: మెగాస్టార్ అభిమానులంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఆచార్య మూవీ మెగాఫ్యాన్స్ ను నిరాశపచడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న గాడ్ ఫాదర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీని విడుదల గురించి కూడా రూమర్స్ వినిపిస్తున్న వేళ మూవీలోని నయనతార ఫస్ట్ లుక్ ను చిత్ర బృదం రిలీజ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మ‌ల‌యాళంలో మోహన్ లాల్ నట్టించిన లూసీఫ‌ర్‌ కు రీమేక్‌గా తెలుగులో ఈ సినిమా తెరకెక్కింది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొనింది. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ మేక‌ర్స్ సినిమా గురించి వ‌రుస‌ అప్‌డేట్‌ల‌ను రిలీజ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా సినిమాపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇస్తూ, ఈ మూవీపై క్యూరియాసిటీ పెంచడానికి సినిమా నుంచి న‌య‌న‌తార ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్‌గా న‌య‌నతార క‌నిపించనుంది. ఈ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.

 

Exit mobile version