Dasara Movie: నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. నాని తాజాగా నటించిన చిత్రం దసరా. చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా నాని కేరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
తాజాగా నాని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సినిమా గురించి నాని చేసిన పోస్ట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. ఆ పోస్టులో దసరా సినిమా రెండు భాగాలుగా ఉండబోతుందని తెలుస్తుంది.
Just one.
With the power of two
Or probably more 🙂#Dasara 🔥— Hi Nani (@NameisNani) January 27, 2023
నాని నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా 1990 కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది. ఈ సినిమాలో నాని మాస్ లుక్కులో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, సాంగ్, టీజర్ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
పీరియాడిక్ స్టోరీ కావడంతో.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారని సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా.. చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచారు.
ఈ విషయం నాని (Nani )వరకు వెళ్లడంతో.. దీనిపై స్పందించాడు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన నాని.. ఒక సినిమా దుమ్ము లేపడానికి రెండు పార్ట్స్ ఉండక్కర్లేదు.
ఒక్క పార్ట్ ఉన్నా చాలు.. ఇందులోనే 2, 3 పార్ట్స్ కి కావాల్సిన దమ్ము ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
దీంతో రెండు భాగాలుగా ‘దసరా’ రాబోతుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్రబృదం తెలిపింది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.. సాయి కుమార్, సముద్రఖని, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/