Site icon Prime9

Akkineni Nagarjuna: ఎన్నికల్లో పోటీ పై నటుడు నాగార్జున ఏమన్నారంటే..

Nagarjuna said about contesting elections

Nagarjuna said about contesting elections

Tollywood: వైకాపా తరపున 2024లో విజయవాడ పార్లమెంటు స్థానం నుండి నటుడు అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ వస్తున్న ప్రచారాలకు తెరపడింది. ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తన రాజకీయ ఆరంగ్రేటం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తమని కొట్టిపారేశారు. గడిచిన మూడు పర్యాయాల ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగిందని, అయితే అవన్నీ తాను పట్టించుకోనని చెప్పేసారు.

మరో వైపు 6 నెలల పాటు సినిమా షూటింగులకు సైతం తాను దూరంగా ఉండనున్నట్లు నాగార్జున పేర్కొన్నారు. ఓటీటీలో ఓ సినిమా విడుదల చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. అయితే దానిపై సాధ్య, సాధనాలను పరిశీలించేందుకు తగిన విరామం అవసరమన్నారు. ఈ నేపథ్యంలో సినిమాలకు కొద్ది నెలలు దూరంగా ఉండనున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.

నాగార్జునకు, సీఎం జగన్ కేసుల్లోని నిమ్మగడ్డ ప్రసాదుకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇదే క్రమంలో సీఎం జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకొని అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఏపి ప్రభుత్వం తీసుకొన్న సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు నిర్ణయాన్ని కూడా నాగార్జున సమర్ధించి వున్నారు. ఒక విధంగా సినిమా రంగంతో పనిలేకుండా టిక్కెట్ల పెంపును ఆయన స్వాగతించారు.

దీంతో గత కొద్ది రోజులుగా వైకాపా తరపున ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలకు ఎట్టకేలకు నాగార్జున తెరదించారు. మరోవైపు అధికార పార్టీ తీరుతో ఏపీ ప్రజలు, ప్రతిపక్షాలు స్పందనతో పాటు మూడు రాజధానుల వ్యవహారంలో ఇరుక్కొనేందుకు నాగార్జున పెద్దగా సుముఖంగా లేన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇంటి వ్యవహారాల్లో అడప, దడప నాగార్జున కుటుంబం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూనే ఉంది. తాజాగా రాజకీయంగా కూడా కొన్ని వార్తలు ట్రోల్ అవడంతో నాగార్జున కొద్దిగా ఇబ్బంది పడిన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: గుజరాత్ లో రూ.25.80కోట్ల నకిలీ నోట్లు.. పట్టుబడ్డ నోట్లన్నీ రెండు వేల రూపాయలే

Exit mobile version