Site icon Prime9

Megastar Chiranjeevi: మెగాస్టార్ తో డాన్స్ చేసిన మిస్ ఇండియా

Miss India

Miss India

Tollywood: కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలో ఒకటి ‘ఐటెమ్ సాంగ్స్’. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్‌లను ఐటెమ్ గర్ల్స్‌గా పెట్టుకుంటున్నాయి. సాంగ్ ఏదైనా సరే గ్రేసీ లుక్ కనిపించాలంటే అది మెగాస్టార్ కే సాధ్యం. కాని చిరు మూవీలో ఇప్పటివరకూ ఐటెం సాంగ్ కు సరైన జోడీ ( సిమ్రాన్ తప్ప) దొరకలేదని చెప్పాలి.

సినిమాల్లోకి రీ-ఎంట్రీ అయిన తర్వాత, చిరంజీవి కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా మరియు శృతి హాసన్ లతో జతకట్టారు. ఖైదీ నంబర్ 150లో “ రత్తాలు రత్తాలు ” అనే ప్రత్యేక పాట కోసం చిరంజీవితో పాటు లక్ష్మీ రాయ్ డ్యాన్స్ చేసారు. సైరాలో ఐటమ్ నంబర్ లేదు. కానీ ఆచార్య కోసం, మెగాస్టార్ రెజీనా కసాండ్రాను ఐటెమ్ గర్ల్‌గా ఎంచుకున్నారు. గాడ్ ఫాదర్ లో వరినా హుస్సేన్ చేసారు. అయితే వీరందరికన్నా బెస్ట్ ఐటమ్ గర్ల్ ఇపుడు మెగాస్టార్ తో డాన్స్ చేసిందని తెలిసింది.

మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్య చిత్రంలో మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా చిరుతో కలిసి స్టెప్పులేసారు. ఈ సినిమాను వేగంగా ముగించాలని దర్శకుడు బాబీ ఈ పాట గురించి పెద్దగా హైప్ క్రియేట్ చేయకుండా షూట్ చేసారని సమాచారం. మరి ఈ సాంగ్ ఎలావుందో చూడాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

Exit mobile version