Site icon Prime9

God Father: దసరా బరి నుంచి తప్పుకున్న గాడ్ ఫాదర్ ?

god-father movie review

god-father movie review

Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే గాడ్ ఫాదర్ ఆలస్యమైందని, అనుకున్న ప్రకారం విడుదల కావడం లేదని టాలీవుడ్ వర్గాల టాక్.

ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్‌కి వాయిదా పడిందని, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉందని అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చని తెలుస్తోంది. తమన్ కూడా రీ-రికార్డింగ్ కోసం సమయం కేటాయించాల్సి వచ్చింది అది పెండింగ్‌లో ఉంది.

ప్రస్తుతానికి గాడ్ ఫాదర్ రిలీజ్ ఎందుకు వాయిదా పడిందనే విషయం పై పూర్తి క్లారిటీ లేదు. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావలసి ఉంది. చిరంజీవి, నయనతార, సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన గాడ్‌ ఫాదర్‌ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నిర్మించింది.

Exit mobile version