Site icon Prime9

Ram Charan: కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పిన మెగా పవర్ స్టార్

ram charan prime9news

ram charan prime9news

Tollywood: రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా విజయంతో తన నెక్స్ట్ ప్రాజెక్టులకు పట్టాలె క్కిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్  డైరెక్టర్ శంకర్ తో RC 15 సినిమా  చేస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. శంకర్ RC 15 తో పాటు భారతీయుడు 2 సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు. అంతకుముందు భారతీయుడు 2 సినిమా పక్కన పెట్టారు కానీ, ఇప్పుడు ఈ సినిమా ఐపోయిన తరువాత  శంకర్ రామ్ రామ్ చరణ్ సినిమాను చేయనున్నారని తెలుస్తుంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ ఇంకో సినిమా దర్శకుడుకు ఓకే  చెప్పి ఇప్పుడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారని సోషల్ మీడియాలో ఓ వార్తా  తెగ చక్కర్లు కొడుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ చేశారని తెలిసిన సమాచారం.

అంతకుముందు గౌతమ్ తీసిన జెర్సీ హిందీ రీమేక్  ఫ్లాప్ అయ్యింది. ఈ సమయంలో గౌతమ్ తో సినిమా చేసి రిస్క్ ఎందుకని ఆలోచించి, రామ్ చరణ్ ఈ  సినిమా ప్రాజెక్ట్ పక్కన పెట్టారని తెలుస్తుంది. ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమా చేయాల్సి ఉంది. గౌతమ్ తో రామ్ చరణ్ సినిమా క్యాన్సిల్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇంకో దర్శకుడి కోసం యూవీ క్రియేషన్స్ వారు వెతుకులాట మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇదే క్రమంలో వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పేరు బాగా వినబడుతుంది. రామ్ చరణ్ తో  కొత్త ప్రాజెక్ట్ లాక్  చేశారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version