Site icon Prime9

Mass Raja Lyric video: మాస్ మహారాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ పాటకి ధియోటర్లో పూనకాలే..!

mass-maharaja-song

Tollywood: మాస్ మహారాజా రవితేజ ఏ సినిమా తీసినా ఆయన అభిమానులు థియేటర్ వచ్చి చూస్తారు. ఎందుకంటే రవి తేజ కామెడీ టైమింగ్ అలా ఉంటుంది. కాబట్టి నిజమే, రవితేజ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే డ్యాన్సులు, ఫైట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాయి. కాకపోతే ఈ మధ్య రవి తేజ నుంచి సరయిన సినిమాలు రావడం లేదు. ‘క్రాక్’ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. అంతే అక్కడ నుంచి మళ్ళీ బ్యాడ్ టైమ్ మొదలయ్యింది. తరువాత ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాప్స్ పడ్డాయి.

ధమాకా సినిమా నుంచి ‘మాస్ రాజా’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. భీమ్స్ ఈ పాటకను కంపోజ్ చెయ్యగా, రామజోగయ్య శాస్త్రి అందరికీ ఊపు తెప్పించే మాస్ లిరిక్స్ రాశారు. ఇక ఈ పాట పాడిన నకాష్ అజీజ్ ఫుల్ స్వింగ్ మోడులో ఈ పాటను పాడారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుగుతున్నాయి. అక్టోబర్ 21న ‘ధమాకా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మాస్ పాట సినిమాకు కొత్త క్రేజ్ను తెచ్చి పెట్టింది.

ఈ సినిమాలో రవితేజ హీరోగా, పెళ్ళి సందడి ఫేం శ్రీ లీల హిరోయిన్ గా నటిస్తుంది. పవిత్ర లోకేష్, హైపర్ ఆది, రాజశ్రీ, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, అలీ, ప్రవీణ్, చిరాగ్ జానీ, తులసి మొదలగు నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కార్తీక్ ఘట్టమనేని చేయగా, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, స్టంట్స్ వెంకట్, రామ్ లక్ష్మణ్, ఈ సినిమాకు కొరియోగ్రాఫర్లుగా, శేఖర్ వీజే, జానీ, యశ్ పని చేశారు. ఈ సినిమాకు పాటలు రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ రాశారు.

Exit mobile version