Site icon Prime9

Manchu Lakshmi: మాకు అందుకే టాలీవుడ్ లో ఛాన్సులు ఇవ్వడం లేదంటూ మంచులక్ష్మి షాకింగ్ కామెంట్స్

manchu lakshmi

manchu lakshmi

Manchu Lakshmi: మంచు లక్ష్మి అంటే చాలు ఆమెది ఓ ప్రత్యేకమైన కంఠస్వరం.. తనదైన శైలిలో ప్రజలను మెప్పించడంలో తండ్రికి తగ్గ కుమార్తెగా ఆమెకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందంతా ఒకెత్తు అయితే మోహన్ బాబు గారాలపట్టిగా మంచు లక్ష్మి అందరికి సుపరిచయమే. నటిగా, యాంకర్ గా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమెరికాలో సెటిలై, అక్కడ కొన్ని సినిమాల్లో నటించి తిరిగి ఇండియాకు వచ్చింది మంచు లక్ష్మి. కాగా తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనంగా మారాయి.

టాలీవుడ్లో మాకు ఛాన్సులు లేవు(Manchu Lakshmi)

తాను హాలీవుడ్ యాక్టర్ అని, అక్కడే కొన్ని సినిమాలు చేశానని మంచు లక్ష్మి చెప్పారు. అక్కడే ఉంటే ఈ పాటికి తాను స్టార్ అయ్యేదానినని.. కానీ పాప కోసం, ఫ్యామిలీ దగ్గరగా ఉంటుందని ఇండియాకు తిరిగి వచ్చేశానని.. ఇప్పుడు కూడా అవకాశం వస్తే కచ్చితంగా మళ్ళీ హాలీవుడ్ కి వెళ్ళిపోతానంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈసారి హాలివుడ్ కు వెళ్తే తిరిగి రానని.. ఇక్కడ చాలా కష్టపడ్డాను.. కానీ టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు ఇవ్వరంటూ వివరించింది. మధుశాలిని, బిందు మాధవి, నిహారిక, శివాని.. ఇలా చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్లకి తగిన ఛాన్లులు లేవని వాళ్లని చిన్నచూపు చూస్తూ వేరే రాష్ట్రాల హీరోయిన్స్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆడియన్స్ కూడా బయటి హీరోయిన్స్ నే లైక్ చేస్తున్నారంటూ.. వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తీసుకొస్తేనే చూస్తున్నారంటూ ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి చెప్పారు.

అంతే కాకుండా మరి మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వొచ్చు కదా అని యాంకర్ అడుగగా.. నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది.. కానీ నేను ఎంతమందికి ఇవ్వగలను, నాకే సరైన ఛాన్సులు లేవు, ఇంక నేనెలా వేరేవాళ్లకి ఛాన్సులు ఇవ్వగలుగుతాను అంటూ చెప్పుకొచ్చారు. దీనితో ఇప్పుడు మంచులక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

Exit mobile version