Site icon Prime9

Mahesh Babu: మహేష్ బాబు వెబ్ సైట్.. ఫర్ ది చిల్డ్రన్ టు ది చిల్డ్రన్ అంటున్న సితార

Mahesh babu website

Mahesh babu website

Mahesh Babu: మహేష్ బాబు ఈ పేరు గురించి ఈయన చేసే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ ఆయన హీరోనే. వరుస సినిమాలు, కాస్త ఫ్రీ టైం దొరికితే కుటుంబంతో బిజీగా సమయం గడుపుతుంటాడు మహేశ్. ఇదిలా ఉంటే సినిమా కుటుంబమే కాకుండా తనకు సమాజం అనే మరో కుటుంబం కూడా ఉందంటూ అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నాంటారు మన ప్రిన్స్.

ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో చిన్నారులకు తన వంతు సాయం చేస్తూ తన పెద్ద మనసు చాటుకుంటుంటారు ఈ సూపర్ స్టార్. మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్‌ సహకారంతో ఇప్పటికే వందలాది మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో సంతోషం నింపారు మహేష్. అంతేకాకుండా వారి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను ఆయన దత్తత తీసుకుని అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నిజమైన శ్రీమంతుడు. సామాజిక సేవాలో ముందుండే మహేశ్‌ ప్రచారానికి మాత్రం ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ కొత్త ఏడాది సందర్భంగా సేవాకార్యక్రమాల్లో మరో అడుగు ముందుకేశారు. తన సేవను మరింత విస్తరించేందుకు మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్ (http://maheshbabufoundation.org) పేరుతో కొత్తగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

న్యూ ఇయర్ రోజున పిల్లల కోసం ఈ వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నట్టు మహేశ్ ముద్దుల కూతురు సితార ఘట్టమనేని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ నెల తన పాకెట్ మనీని మహేశ్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ఆమె వీడియో ద్వారా తెలిపింది. మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. ఫర్ ది చిల్డ్రెన్ టు ది టిల్డ్రెన్ అంటూ మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టిద్దామంటూ సితార పేర్కొంది.

Exit mobile version