Prime9

Vijay Devarakonda: చిక్కుల్లో విజయ్ దేవరకొండ.. పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు

Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిక్కుల్లో పడ్డారు. తనదైన స్టైల్లో చేస్తున్న కామెంట్స్ తో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆదివాసీలను అవమానించారని పేర్కొంటూ కిషన్ లాల్ చౌహన్ అనే లాయర్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు వీడీపై అందిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇటీవల హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రమోషన్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. వేడకకు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ టెర్రర్ ఎటాక్ పై మాట్లాడుతూ.. గిరిజనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టెర్రరిస్ట్ కొడుకులకు కూడా చిన్నప్పటి నుంచి సరైన ఎడ్యుకేషన్ ఇప్పించలేదు కాబట్టి ఇలా బ్రెయిన్ వాష్ కాకుండా ఉన్నారని అన్నాడు. గతంలో గిరిజనులు ఘర్షణలు పడినట్టుగా కాశ్మీర్ లో దాడులు, విధ్వంసం సృష్టిస్తున్నారని మాట్లాడారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారితీశాయి. గిరిజనులపై తప్పుగా మాట్లడటమే కాకుండా..  టెర్రరిస్టులతో తమను పోల్చడంపై పలు గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Exit mobile version
Skip to toolbar